విటమిన్ ‘E’ తక్కువ అయితే ఎన్ని నష్టాలో తెలుసా..?

మానవ శరీరం నిత్యం చురుగ్గా ఉండాలంటే విటమిన్లు చాలా అవసరం. ఒక్క విటమిన్ కాస్త తక్కువ అయినా కూడా మన శరీరం పనితీరు దెబ్బతినే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ E లోపం వల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. అవేంటో ఒకసారి చూద్దాం..

ఈ విటమిన్ లోపం వల్ల చర్మం సంబంధిత వ్యాధులు వస్తాయి అలాగే కళ్లకు సంబంధించి చూపు సమస్యలు ఎదురవుతాయి. మానవ శరీరం మెకానిజంను బలోపేతం చేయడంలో ఇది పెద్ద సహకారాన్ని అందిస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. యువీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అందుకే మీ రోజువారీ ఆహారంలో విటమిన్ E ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.. ఎటువంటి ఆహారపదార్థాలలో ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం..

అవకాడో:


ఈ పండు తెలియని వాళ్ళు బహుశా ఉండరేమో.. ఫైబర్ శాతం ఇందులో ఎక్కువగా ఉంటుంది.. బరువు తగ్గాలని అనుకొనేవాళ్ళు ఈ పండ్లను రోజుకు రెండు చొప్పున తింటే చాలా మంచిదట.. ఇక విటమిన్ ఈ కూడా ఎక్కువగా ఉంటుంది.

బాదాం:

బాదమ్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయొజనాలు గురించి అందరికి తెలుసు.. చర్మ సౌందర్యానికి బాదాం చాలా బాగా ఉపయోగ పడుతుంది.మీ చర్మాన్ని రక్షించడానికి అన్ని రకాల యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఇందులో ఉంటాయి. అయినప్పటికీ, బాదంలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజు కొన్ని బాదాం తినాలని వైద్యులు సూచిస్తున్నారు..

సన్‌ఫ్లవర్ ఆయిల్:

సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌లో విటమిన్‌ ఈ అధికంగా ఉంటుంది. ఇది విటమిన్ ఈ అద్భుతమైన ఆహార వనరుగా నిపుణులు పిలుస్తారు. కొవ్వును తగ్గించడంతోపాటు మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇకపోతే బియ్యం ఊక, గోధుమ జెర్మ్, ఆలివ్, పొద్దుతిరుగుడు, సోయాబీన్, మొక్కజొన్న నూనె మొదలైన కూరగాయల నూనెలు విటమిన్ ఈ గొప్ప వనరులు. అన్ని కూరగాయల నూనెలు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారపదార్థాలను తప్పనిసరిగా తీసుకొవాలి..

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.