మనం రోజూ వండే వంటల్లో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉంటుంది. కానీ కొందరు దీనిని నిర్లక్ష్యం చేస్తారు. ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదంటారు.. నిజంగానే ఉల్లిపాయతో అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. అయితే కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేయాలో తోచదు. సమయానికి వైద్యులు కూడా అందుబాటులో ఉండరు. ఇలాంటి సమయంలో ఉల్లిపాయతో చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. కొన్ని బాధలు తొలిగిపోతాయి. దాదాపు 5 వేల సంవత్సరాల నుంచి ఉల్లిపాయను కూరల్లో వాడుతున్నాం. ఉల్లిపాయలో అనేక ఔషధ గుణాలు ఉండడడమే అందుకు కారణం. అయితే ఈ చిన్న చిట్కాలు పాటించి కొన్ని ఆనారోగ్య బాధల నుంచి బయటపడొచ్చు.

ఒక్కోసారి మనకు చెవులు వినిపించనట్లు అవుతుంది. అవతలి వ్యక్తులు చెప్పే విషయాలు అస్సలు వినబడవు. ఇలాంటి సమస్యను ఉల్లితో పొగోట్టచ్చు. ఉల్లిపాయను ముక్కులుగా కోసం చెవి దగ్గర ఉంచుకోవాలి. అయితే చెవి లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఉల్లిలోని రసం చెవిలోపలికి వెళ్లి సమస్య తగ్గుతుంది. ఆ తరువాత ఎదుటివారి మాటలు స్పష్టంగా వినిపిస్తాయి. అయితే ఉల్లిపాయను ఇలా ఉంచిన మరుసటి రోజు చెవిని శుభ్రం చేసుకోవాలి.
కాలిన గాయాలు మానడానికి ఉల్లి మంచి ఔషధంలా పనిచేస్తుంది. కాలిన చోట ఉల్లిని కోసి రుద్దాలి. 5 నిమిషాల పాటు అలా చేయడం వల్ల మంట తగ్గుతుంది. అదే విధంగా తేనేటీగ, కందిరీగా కుట్టిన చోట తీవ్ర నొప్పి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ గడ్డలాగా మారుతుంది. దీంతో తేనేటీగా కుట్టిన చోట ఉల్లిపాయతో రుద్దడం వల్ల సమస్య తగ్గుతుంది.
ఇక అధిక ఉష్ణోగ్రత ఉన్న వాళ్లు కూడా ఉల్లిపాయతో ఉపశమనం పొందవచ్చు. ఇందుకోసం ఉల్లిపాయను రెండు ముక్కలుగా కోసం అరికాలుపై పెట్టాలి. ఆ తరువాత దానిపై నుంచి సాక్స్ లు వేసుకోవాలి. శరీరంలోని ఉష్ణోగ్రతను ఈ ఉల్లిపాయ తీసేస్తుంది. అంతేకాకుండా ప్రతీరోజు ఆహారంలో ఉల్లిపాయ ఉండే విధంగా చూసుకోవాలి. రోజూ ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు.