చాలా మంది రుచి కోసం ఏవేవో తింటుంటారు. ఇంట్లో ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని వదిలి రెస్టారెంట్ల బాట పడుతారు. అయితే అవి ఒక్కోసారి శరీరానికి కీడు చేస్తాయని తెలుసుకోవాలి. ఇలా బయట ఫుడ్ తింటున్న వారిలో ఎక్కువగా మొలలు, ఫైల్స్ వ్యాధులు వస్తున్నాయి. వాటిని తగ్గించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వేలకు వేలు ఖర్చు పెట్టినా ఆ సమస్య నుంచి బయటపడడం లేదు. అయితే కొన్ని చిట్కాల ద్వారా వీటిని పొగొట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మొలలు 9 రకాలు. వాటిలో మొదటి రకం మొలలు తగ్గించుకోవడానికి ఓ చిట్కా ఉంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి మొలలు వస్తాయి. మొలల వ్యాధి ఉన్నవారు గంటల కొద్దీ మలవిసర్జన కోసం కూర్చుంటారు. అంతేకాకుండా మల విసర్జనలో రక్తం పడడం లాంటి సమస్యలు ఏర్పడుతాయి. ఎక్కువగా ఒకేచోట కూర్చోకుండా.. ఎక్కువ సేపు నిల్చోకుండా తీవ్ర బాధలు కలుగుతాయి. అందువల్ల మొలల వ్యాధిని భరించడం చాలా కష్టం. అయితే ఓ చిట్కా ద్వారా దీనిని తగ్గించుకోవచ్చు.

వంట రూంలో దొరికే కొంచెం వాము తీసుకొని దానిని చేతిలో నలపాలి. అలా చేయడం వల్ల దానిపై ఉండే దుమ్ము వెల్లి అసలైన గింజలు లభ్యమవుతాయి. ఈ గింజలను రోలలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. రోలు లేనివారు మిక్సీలోనూ రెడీ చేసుకోవచ్చు. ఆ తరువాత ఒక గ్లాసు మజ్జిక తీసుకొని పావు చెంచా నల్ల ఉప్పు వేసుకోవాలి. ఆ తరువాత పావు చెంచా అప్పటికే రెడీ చేసుకున్న వాము పొడిని కలపాలి. ఇలా తయారు చేసుకొని ప్రతిరోజూ రెండు గ్లాసులు తాగుతూ సమస్య తగ్గే వరకు చేయాలి.
మీకు మొలల వ్యాధి తగ్గే వరకు దీనిని తీసుకోవచ్చు. కనీసం పదిరోజుల వరకు ఇలా చేస్తే కచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా మలబద్ధకం సమస్య నివారించి విసర్జనం సాఫీగా అవుతుంది. అలాగే నల్ల ఉప్పు కూడా మురళీ వ్యాధులను తగ్గించడంలో ఉపకరిస్తుంది. ఇది తాగుతూనే మసాలాలాు తక్కించాలి. అధిక ఫైబర్ ఉండే పదార్థాలను తీసుకోవాలి.