చక్కెరను తింటే షుగర్ వస్తుందని భయపడతారు.. షుగర్ కన్నా తీపు తింటే బరువు పెరుగుతామని భావించి అసలు తినడమే మానెస్తారు.. అలా చేయడం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవి ఏమిటో ఒకసారి చూద్దాం..
షుగర్ పూర్తిగా మానేయడం మంచిది కాదు. డయాబెటిస్ ఉన్నవారు షుగర్ పట్ల కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే కానీ,డయాబెటిస్ లేనివారు కూడా చక్కెరను చూసి అతిగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మన శరీరానికి ఎక్కువ చక్కెర ఎంత ప్రమాదమో… చక్కర తక్కువగా ఉంటే కూడా అంతే ప్రమాదం అని గుర్తుంచుకోండి..
గొంతు మంటగా ఉండేవారికి చెరకు గడ రిలీఫ్ ఇస్తుంది. యాంటీ బయోటిక్‌లా పనిచేస్తుంది. చెరకుగడ నములుతూ ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అదే చెరకు నుంచి తయారుచేసే పంచదారలో… కొన్ని రసాయనాలు, పొడులు కలుపుతారు. అందుకె చక్కెరను మరీ ఎక్కువ, మరీ తక్కువ కాకుండా బ్యాలెన్స్‌గా తీసుకోవాలి..
చక్కెర స్థానంలో బెల్లం వాడటం మేలు. నల్లబెల్లం అయితే ఇంకా మంచిది. పసుపు రంగులో ఉండే బెల్లం కంటే ఎరుపు, నలుపు రంగులో ఉండేదే మంచి బెల్లం అని మర్చిపోకండి. పసుపు రంగు బెల్లంలో అలా కనిపించేలా కెమికల్స్ కలుపుతారు. అది మంచిది కాదు. సో, పంచదార వాడండి. అలాగని ఎక్కువగా కాకుండా జాగ్రత్తగా వాడటం మంచిది..