వాము నీటిని ఇలా తీసుకుంటే ఎమౌతుందో తెలుసా?

manaarogyam

వాము గురించి ప్రత్యెకంగా చెప్పనక్కర్లేదు.. స్నాక్స్ ల లో ఈ వామును విరివిగా వాడుతుంటారు..అయితే ఈ వామును నిత్యం తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. మరి వాము లో ఉండే ఆ అద్బుత సుగుణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాము ఒక స్పూన్ తీసుకుని దోరగా వేగించి ఒక గ్లాసులో వేసి దానిలో నీటిని పోసి రాత్రంతా అలా వదిలేయాలి మరుసటి రోజు ఆ నీటిని మరిగించి వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఈ విధంగా తాగటం వలన గ్యాస్, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు మాయం అవుతాయి.

ఇకపోతే బరువు తగ్గాలనుకునే వారికి ఈ వాము నీళ్ళు సహాయపడతాయి.వాములో ఉండే థైమోల్ కడుపులో గ్యాస్ట్రిక్ రసాలను ఉత్పత్తి చేసి జీర్ణ ప్రక్రియ బాగా జరిగేలా ప్రోత్సహిస్తుంది. గర్భదరణ సమయంలో వచ్చే మలబద్దకం సమస్యను కూడా వాము నియంత్రించగలదని నిపుణులు అంటున్నారు.

దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి వాటిని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడి అయ్యాక అరస్పూన్ వాము, 4 తులసి ఆకులను వేసి 5 నిమిషాల పాటు మరిగించి వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే ఆ సమస్యలు దూరం అవుతాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలను వాము తగ్గిస్తుంది..

Leave a Comment