ఈ రెండిటితో ఆరోగ్యం అదరహో..

manaarogyam

బాదాం లో ఎన్ని పొషక విలువలు ఉన్నాయో అందరికీ తెలుసు.. ప్రతి రోజూ రెండు తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం అవుతాయని నిపుణులు అంటున్నారు.. ఇక ఖర్జూరాలు.. రక్థాన్ని పెంచుకునేందుకు ఇవి సహాయపడుతుంది. ఆరోగ్యానికి అందానికి బెస్ట్ ఖర్జూరాలు.. ఈ రెండింటిని కలిపి మంచి స్వీట్ చేసుకొని తింటే ఎలా వుంటుంది. వింటుంటే నోరు ఊరుతుంది కదా.. అవును వీటితో పాయసం చేసుకుంటే అదిరిపోతుంది.. ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసినవి:

ఎండు ఖర్జూరం తరుగు: పావు కప్పు

బాదం పప్పు:పావు కప్పు

ఎండుకొబ్బరి కోరు:పావు కప్పు

పాలు:మూడు కప్పులు

కలాకండ్:ఒక టీ.

పంచదార:పావు కప్పు

మరిగించి చల్లార్చిన పాలు:అర కప్పు

యాలకుల పొడి:కొద్దిగా

తయారి విధానం:

తరిగిన ఖర్జూరం, బాదంపప్పులను, ఎండుకొబ్బరి కోరును పేస్టులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలాకండ్‌తోపాటు పాలల్లో కలిపి సన్నటి సెగమీద వేడి చేయాలి. మిశ్రమం చిక్కబడుతుండగా పంచదార, మరిగించిన పాలు కలపాలి. పంచదార బాగా కరిగిన తరువాత యాలకుల పొడి వేసి దించాలి.. అంతే పాయసం రెడీ..

Leave a Comment