గుడ్డుతో జుట్టు కలిగే లాభాలు ఏంటో తెలుసా..?

manaarogyam

కోడి గుడ్డు గురించి ప్రత్యెకంగా చెప్పనక్కర్లేదు.. పోషకాల పుట్టినిల్లు..అందుకే అంటారు రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని..ఆరోగ్యం తో పాటుగా అందాన్ని మెరుగుపరచడానికి గుడ్డు ఉపయోగపడుతుంది. బీ కాంప్లెక్స్, బయోటిన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు కావలసిన పోషకాలను అందించి జుట్టు బలంగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతాయి.

అందుకే ఇన్ని పోషకాలు గల గుడ్డును హెయిర్ ప్యాక్ లలో వాడితే జుట్టు పెరగడానికి దోహదపడుతుందని ఆయుర్వెద నిపుణులు అంటున్నారు.ఎలా వాడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కోడిగుడ్డు జుట్టుకు మంచి హెయిర్ కండిషనర్ గా సహాయపడుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో కోడిగుడ్డు కొంచెం నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా అప్లై చేసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో గాఢత తక్కువగా ఉండే షాంపూ తో తలస్నానం చేయాలి.మంచి నిగారింపు రావడంతో పాటుగా జుట్టు కూడా పెరుగుతుంది..ఇలా వారానికి ఒకసారి అప్లై చేస్తె మంచి ఫలితం ఉంటుంది..

Leave a Comment