కంటి సమస్యలకు ఈ ఆకు భేష్..

manaarogyam

ఆహారం లో మార్పుల వల్ల లేదా.. కాలుష్యాల వల్ల కంటి చూపు తగ్గుతుంది.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల కళ్ళకు ఎన్నో సమస్యలు బాధించవచ్చును. అలాంటి సమస్యల నుంచి బయట పడటానికి కొన్ని ఆకు కూరలు తినాలని అంటున్నారు. అందులో ముఖ్యంగా పోనగంటి ఆకు ను తీసుకోవడం వల్ల మంచి ఫలిథాలు ఉంటాయి. ఎటువంటి పొషకాలు దాని ద్వారా అందుతాయని నిపుణులు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

పొన్నగంటి ఆకులో ఏ , బి6, పోలేట్ , రైబో ప్లేవిన్, సి , ఇనుము, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.రోజు తినే ఆహారంలో పొన్నగంటి ని భాగం చేసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా కంటి చూపు మెరుగు పడటానికి ఈ పొన్నగంటి ఆకు దోహద పడుతుంది. ప్రస్తుత కాలంలో గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వాళ్ళకి కంటి కింద నల్లటి చారలు ఏర్పడతాయి. అలాంటప్పుడు ఒక గ్లాస్ నీటిలో ఈ ఆకులని ఉడికించి మిరియాల పొడి కలుపుకుని తాగితే కంటికింది నల్లటి చారలు పోతాయి.బిపి కంట్రోల్, షుగర్ కంట్రోల్, వెయిట్ కంట్రోల్ తో పాటుగా గుండెకు మంచి ఆరోగ్యం, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది..

Leave a Comment