నీళ్ళు ఎంత ఎక్కువగా తాగితే అంత ఆరోగ్యం అని వైద్యులు అంటున్నారు.. ఎటువంటి అనారొగ్య సమస్యలు దరిచెరవు.. మనం తాగే నీటిలో ఎన్నొ పొషకాలు ఉన్నాయి.నీటిని తాగడం వలన మనకు వచ్చే 50 శాతం రోగాలను నయం చేసుకోవచ్చు.. ఇప్పుడంటే నీటిని శుద్ధి చేయడానికి వాటర్ ఫిల్టర్లు, ఆర్వో ఫ్యూరీఫైయర్లు వాడుతున్నాం కానీ.. మన అమ్మమ్మ, తాతల కాలంలో మాత్రం రాగి పాత్రల లో తాగే వారు.. అలా నీళ్ళు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయట.. అవేంటో తెలుసుకుందాం..
రాగి పాత్రలో నీరు తాగడం వలన కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తి , అల్సర్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పడటానికి నీరు సహాయపడతాయి. కాలేయం, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి.. క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా ఉంటాయి. బరువును తగ్గించుకోవాలని అనుకునేవారికి ఇది చక్కటి మార్గం..ఉదయాన్నే ఈ నీళ్ళు తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయట… సో ఇప్పటి నుంచి రాగి పాత్ర లోని నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి..