ఫైనాఫిల్ తో ఆ సమస్యలకు చెక్..

manaarogyam

వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య ఏసీడిటి.ఈ రోజుల్లో ఈ సమస్య తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏసీడిటి వచ్చినప్పుడు గుండెల్లో మంట, ఆయాసం వంటి సమస్యలు బాధించవచ్చును. వీటి నుంచి బయట పడాలంటే డాక్టర్ ను సంప్రదించే వాళ్లు. ఇలాంటి సమస్యల ను ఇంట్లో దొరికే వాటితో నయం చేయవచ్చు. అని నిపుణులు సూచిస్తున్నారు..

ఎసిడిటీకి చెక్ పెట్టడంలో పైనాపిల్ అద్భుతంగా సహాయపడుతుంది. భోజనం తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ పైనాపిల్ రసం తీసుకుంటే తీసుకున్న ఫుడ్ త్వరగా డైజెస్ట్ అయిపోయి.. ఎసిడిటీ సమస్య దరి దాపుల్లో రాకుండా ఉంటుంది. అలాగే యాపిల్ సిడార్ వెనిగర్‌ను కూడా ఎసిడిటీ నివారణకు మందుగా ఉపయోగించవచ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకుని సేవించాలి..వెంటనే ఈ సమస్యను తగ్గించడంతోపాటు అధిక బరువును కూడా కంట్రోల్ చేస్తుంది..కాఫిని అధికంగా తాగే వారిలో, మద్యం సెవించె వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఏదైనా లిమిట్ గా తీసుకోవటం మంచిది.

Leave a Comment