ముల్లంగిని చలికాలంలో తినొచ్చా? తింటే ఏమౌతుంది..

manaarogyam

ముల్లంగి.. ఈ పేరు చాలా మందికి తెలియదు.. ఇది కూడా క్యారెట్ జాతికి చెందిన దుంప. ఇవి కూడా భూమిలోనుంచి తీస్తారు. క్యారెట్ తో సమానంగా పోషక విలువలు ఉంటాయి.దీన్ని రాడిస్ అంటారు.ఈ దుంపలు ఎక్కువగా లభిస్తాయి.ముల్లంగితో ఎన్నో ప్రయోజనాలున్నాయి..

ఈ కాలంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి.ఈ ముల్లంగిలను తీసుకోవడం వల్ల రోగనిరోధక పెరుగుతుంది.అంతేకాదు చలికాలంలో ఇబ్బంది పెట్టె చర్మ వ్యాధుల నుంచి కాపాడుతుంది.ఇందులో విటమిన్ సి, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బి6, ఫోలేట్, పొటాషియం, ఐరన్, మాంగనీస్, ఫైబర్, షుగర్ పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో ముల్లంగిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలున్నాయి. ఇందులో కాల్షియం, పొటాషియం గుండె జబ్బులను తగ్గిస్తుంది.

ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే బరువును తగ్గించడంలో సహాయపడుతుంది..ఇక షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. మధుమేహం ఏర్పడకుండా నిరోధించే అనేక ఎంజైములు ఉన్నాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలోనూ సహాయపడుతుంది. అలాగే కడపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలోని  నీటి శాతాన్ని తగ్గకుండా కాపాడుతుంది.. సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది..

Leave a Comment