బచ్చలి కూర లో పోషక విలువలు ఎక్కువే..

manaarogyam

ఆరోగ్యం పై శ్రద్ద తో ఏవేవో తింటున్నారు.. డబ్బులు పోసి బాధపడటం కన్నా ఆకు కూరలు తినడం ఉత్తమం..ఆకు కూరలు ఆరోగ్యానికి మంచిది. సహజంగా లభించే వాటితో శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్లు అందుతాయని నిపుణులు అంటున్నారు.. ఒక్కో ఆకు కూరల్లొ ఒక్కో విధమైన పొషకాలు ఉన్నాయి. ముఖ్యంగా బచ్చలికూర లో శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. దీనిని సూపర్ ఫుడ్ గా ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

బచ్చలకూర తినడం వలన మెదడు ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు లోని సెల్స్ డ్యామేజ్ కాకుండా రక్షిస్తుంది. బచ్చలి కూర నైట్రేట్ల కు గొప్ప మూలం.. రక్తపోటును రాకుండా చూస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఈ ఆకు కూరలు సహాయపడతాయి.బచ్చలికూర ఉడకబెట్టుకొని తింటే చాలా మంచిది.. ప్రై చేసుకొని తినడం వల్ల ఎటువంటి ప్రయోజనంలేదని నిపుణులు అంటున్నారు. ఇకపోతే స్మూతీ గా తయారు చేసుకుంటే మరింత ఆరోగ్యం అట..ఆకు కూరలను ఫ్రై చేసుకొని తినడం కన్నా నీటిలో ఉడికించి అలానే తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి..

Leave a Comment