బందారు చెట్టు తో ఆ సమస్యలు మాయం..

manaarogyam

బందారు చెట్టు.. ఈ పేరు సిటీలో వుండే వాళ్ళకు పెద్దగా తెలియదు..కానీ పల్లెల్లో వుండే వాళ్ళకు ఇది గొప్ప సంజీవని. ఎన్నో అనారొగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. అందుకే ఇప్పుడు సిటీలో కుడా ఈ మొక్కల పెంపకాన్ని పెంచారు.ఇక ఆలస్యం ఎందుకు ఎటువంటి ప్రయొజనాలు ఉన్నాయి.. ఎలా వాడితే మంచిది అనేది ఇప్పుడు చూద్దాం..

ఈ చెట్టు ఆకుల నుండి రసం అయితే రాదు. కానీ ఈ చెట్టు ఆకులను తీసుకుని బాగా దంచి మోకాళ్ల నొప్పులు, వాపు ఉన్న వారు మోకాళ్లకు రెండు వైపులా ఉంచి గుడ్డతో గట్టిగా చుట్టేయాలి. ఇలా వారం పది రోజుల పాటు రోజు మోకాలికి కట్టినట్లైయితే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది..ఒక్కొక్కరికి ఒక్కొలా ఉంటుంది.ఎముకలు విరిగినా కూడా ఈ ఆకులను వాడుతారూ..

చెట్టు వేళ్లు ను నీటిలో ఉడికించి ఆ నీళ్లను రోజు పుక్కిలించి ఉమ్మివేయడం వల్ల పళ్లు గట్టిపడతాయట. పళ్లు ఊడిపోయే ముసలి వాళ్లు ఈ నీటిని రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు. ఇలా ఈ చెట్టు లో ఉన్న ప్రతి ఒక్క భాగం కూడా మంచి ఆరోగ్యమే.. ఖర్చు లేకుండా ఎన్నో రొగాలను నయం చెస్తుంది..

Leave a Comment