చిక్కుడు తింటున్నారా? అయితే చూడండి..

manaarogyam

Updated on:

చిక్కుళ్ళు తినడం వల్ల మంచి ఆరోగ్యం ఉందన్న విషయం తెలిసిందే..శరీరానికి కావలసిన ఎన్నో పొషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

రెడ్ బ్లడ్ సెల్స్ లో సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించే దీన్ని తినాలో వద్దో అడగాలి. అలాగే బాగా పెరిగిన చిక్కుడు మాత్రమె తినాలి. మన ఇంట్లో చిక్కుడు చెట్టు ఉండి, ఆ చిక్కుడు తినడమే మేలు. ఎందుకంటే చికుడు పురుగుల బారిన, ఫంగల్ ఎలిమెంట్స్ బారిన పడుతుంది. బయట కొన్న చిక్కుడు ఎలాంటి పురుగులతో పెరిగినా అమ్మేవారు అదంతా పట్టించుకోరు. కాని మంచి చిక్కుడు మనకు దొరకాలే కాని ఇన్ని లాభాలున్నాయి.చిక్కుడు లో కాల్షియం, ఐరన్, మేగ్నేశియం, మంగనీజ్, ఫాస్ ఫరాస్, పొటాషియం, జింక్ లాంటి మినరల్స్ బాగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్, కారోబోహైడ్రేట్, పెద్ద మొత్తంలో కాలరీలు కూడా ఉంటాయి.

చిక్కుడుకాయలో సోలుబుల్ ఫైబర్ దండిగా ఉంటుంది. కాబట్టి ఇది ఇటు బ్లడ్ షుగర్ లెవల్స్ ని, అటు కొలెస్టరాల్ లెవల్స్ ని కంట్రోల్ లో పెట్టగలదు. ఇది గుండె ఆరోగ్యాగానికి చాలా మంచిది. * స్త్రీలు రక్తాన్ని కోల్పోతుంటారు. అలాగే వారి ఎముకలు కోడా బలహీనంగా మారతాయి. ముఖ్యంగా గర్భిణి స్త్రీలకు రక్తం, ఎముకలలో బలం చాలా అవసరం. ఈ అవసరాన్ని కాల్షియం, ఐరన్ ఉన్న చిక్కుడు తీరుస్తుంది. ఇంకా ఎన్నో రోగాలు కూడా నయం అవుతాయి.

Leave a Comment