తమలపాకులతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..

manaarogyam

మాములుగా తమలపాకులను పూజల లోనూ లేదా శుభ కార్యాలయా ల్లొనూ వాడుతుంటారు.అంతే కాదు ఈ మధ్య తమలపాకులతో కొత్త కొత్త వంటలను కూడా తయారు చేస్తున్నారు.తమలపాకుల్లో మంచి ఆరోగ్యం ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా కొన్ని సమస్యలకు మంచి ఔషదం అని నిపుణులు అంటున్నారు.ఈరోజు తమలపాకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

విటమిన్-సీ, థియామిన్, రైబోఫ్లోవిన్, కేరోటిన్ లాంటి విటమిన్లు తమలపాకుల్లో పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం వీటిలో గొప్ప మూలం. వాస్తవానికి తమలపాకుల ఖరీదు చాలా తక్కువగా ఉంటుంది.. క్యాన్సర్ నివారణకు,రక్త హీనత,కొలెస్ట్రాల్ నియంత్రణలో ఈ తమలపాకులు ప్రముఖ పాత్రను వహిస్తాయి.

ఇకపోతే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ వంటి నిరోధక సమ్మేళనాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, ఆల్కలాయిడ్లు, స్టెరాయిడ్లు మొదలగునవి ఉన్నాయి.గాయాలు, మంట, ఉబ్బసం చికిత్సలో ఇది ఉపయోగపడుతుంది. బోధ వ్యాధి నివారణకు ఈ ఆకులను వాడుతారు..

రోజూ ఒక తమలపాకును పది గ్రాముల మిరియాలతో కలిపి నమిలి ఒక గ్లాస్ చల్లని నీళ్ళు తాగడం వల్ల అధిక బరువు తగ్గిపోతారు. ఇలా ఎన్నో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అందరికి తమలపాకులు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.. చుసారుగా తమలపాకులతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయో.. మీరు కూడా ఈ ఆకుల ను వాడటం అలవాటు చేసుకుంటే మంచిది

Leave a Comment