పటిక బెల్లంతో పుట్టెడు లాభాలు..

manaarogyam

పటిక బెల్లం.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్స్‌, మినరల్స్‌, అమినో యాసిడ్స్‌ ఇలా ఎన్నో పోషకాలు పటిక బెల్లంలో ఉంటాయి. అందుకే పంచదారకు బదులుగా పటిక బెల్లంను వాడమని చెబుతుంటారు. పటిక బెల్లంతో ఎన్నో జబ్బులను కూడా నివారించుకోవచ్చు. ముఖ్యంగా దగ్గు సమస్యతో బాధ పడే వారు.. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో కొద్దిగా పటిక బెల్లంను పొడి మరియు మిరియాల పొడి వేసి బాగా కలిపి సేవించాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

అంతేకాదు..అర స్పూన్ పటిక బెల్లం పొడి, పావు స్పూన్ మిరియాల పొడి మరియు కొద్దిగా నెయ్యి కలిపి ఉండలా చేసుకుని తీసుకోవాలి. ఇలా చేస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.రెండు స్పూన్ల పుదీనా ఆకుల రసంలో కొద్దిగా పటిక బెల్లం పొడి కలిపి తీసుకోవాలి. ఇలా ఉదయం, సాయం చేస్తే.. దగ్గు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.జ్వరం వచ్చినప్పుడు పటిక ను తీసుకోవడం వల్ల కొంతవరకు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

Leave a Comment