ఆ ఖర్జూరాలు తింటే ఎన్ని ప్రయోజనాలో..

manaarogyam

వావ్.. ఖర్జూరాలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా.. చిన్న నుంచి పెద్ద వరకూ చాలా మంది వీటిని తింటారు.వీటిలో ప్రోటీన్‌, ఎక్కువగా ఉంటుంది. వెంటనే శక్తీ వస్తుంది. అందుకే ఉపవాస సమయాల్లో ఖర్జూరాలను ఎక్కువగా తీసుకుంటారు. కొన్ని రకాల ఖర్జూరాలు మనకు మార్కెట్ లో దొరుకుతాయి. అందులో గోధుమ రంగులో వుండే ఖర్జూరాలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని నిపుణులు అంటున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..

ప్రొటీన్లు తక్కువ. ఐరన్‌, జింక్‌, పొటాషియం, ఫాస్ఫేట్‌ ఖనిజాలతోపాటు దీంట్లో పీచు అధిక మొత్తంలో ఉంటుంది.రోజూ తింటే డయేరియా, మలబద్ధకం సమస్యలకు దూరంగా ఉండొచ్చు.గింజలను తీసేసి పేస్ట్‌ చేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఈ గుజ్జును, జ్యూస్‌లు, కుకీస్‌, స్వీట్లలో వాడుకోవచ్చు.ఖర్జూరం ముక్కలను సలాడ్స్‌, మొలకలు, కూరల్లో వాడుకోవచ్చు.జీర్ణాశయ సమస్యలకు చెక్‌ పెడుతుంది.దీంట్లోని ఐరన్‌ జుట్టు ఊడకుండా సాయపడుతుంది. అలాగే ఇతర పోషకాలు మేనును మెరిపిస్తాయి.గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది… మీరు కూడా తినండి.

Leave a Comment