టీ లో చక్కెరకు బదులుగా బెల్లం వాడితే ఎన్ని లాభాలున్నాయో..

manaarogyam

పొద్దున్నే లేవగానే చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఆ హాయి వేరుగా ఉంటుంది. టీ తాగకుంటే రోజు గడవదని చాలా మంది అంటున్నారు.
రోజులో రెండు సార్లు టీ ,కాఫీ తాగడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ కొంతమంది మాత్రం మధ్యాహ్నం కూడా టీ తాగుతుంటారు.అలా తీసుకోవడం వల్ల అందులో ఉండే చక్కెర మన శరీరానికి హాని కలగజేస్తుంది. ఎందుకంటే, చక్కెర తయారీలో రసాయనాలు ఎక్కువగా కలుపుతారు. అలా వచ్చిన తీపి వల్ల చాలా నష్టాలు ఉన్నాయని అంటున్నారు.

అందుకే టీలో చక్కెర బదులు బెల్లం తీసుకోమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. టీలో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చని అంటున్నారు.ఇలా బెల్లం తీసుకోవడం వల్ల రక్త హీనత కూడా తగ్గిపోతుంది.అలాగే మలబద్ధకం సమస్యతో బాధ పడే వారు టీలో చక్కెర బదులుగా బెల్లాన్ని కలిపి ఉదయం పూట తీసుకుంటే..జీర్ణ వ్యవస్థ పని తీరు చురుగ్గా ఉంటుంది.

టీలో బెల్లంతో పాటు కాసింత అల్లం, మిరియాలు కూడా వేసుకొని తాగితే రోగనిరోధక శక్తి కూడా మెరుగు పడుతుంది. చూసారుగా చక్కెర బదులుగా బెల్లం వాడితే ఎన్ని ప్రయొజనాలు ఉన్నాయో.. మీరు కూడా ట్రై చెయ్యండి..

Leave a Comment