ఇప్పుడు ఎక్కడ చూసిన విరివిగా దొరికే పండ్లలో రేగి పండ్లు ఒకటి.అబ్బా వీటి పేరు వినగానే నోరు ఊరుతుంది కదా.. వాటి టెస్ట్ అలాంటిది.ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.. అందుకే సీజన్ లో దొరికే వీటిని అస్సలు మిస్ అవ్వొద్దని నిపుణులు అంటున్నారు.

రేగి పండ్లలో పుష్కలంగా ఐరన్ తో పాటు పలు పోషకాలు కూడా ఉంటాయి. ఇవి రక్త హీనత సమస్యను చాలా త్వరగా నివారిస్తాయి. అలాగే ప్రతి రోజు రేగి పండ్లు తీసుకోవడం వల్ల రక్తంలోని ఎర్రకణాల వృద్ధి జరుగుతుంది. ఫలితంగా.. రక్తహీనతతో పాటుగా కండరాల బలహీనత, నీసరం, అలసట వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ.

మరో ముఖ్యమైన విషయం.. బరువు తగ్గాలని అనుకునేవాళ్ళు మాత్రం ఈ పండ్లను తీసుకోవడం ఉత్తమం.ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అందువల్ల, రేగి పండ్లను డైట్‌లో చేర్చుకుంటే.. ఇతర ఆహారలపై దృష్టి పడదు.. దాంతో ఈజిగా బరువు తగ్గిపోతారు.