దానిమ్మలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసా..?

manaarogyam

దానిమ్మకాయలను ప్రతి ఒక్కరూ తింటారు..వాటి రుచి రంగు అలా ఉంటాయి. అయితే చాలా మందికి వీటిని తీసుకోవడం వల్ల ఎంత ఆరోగ్యం ఉంటుంది అనేది తెలియదు.వాటి గురించి తెలిస్తే ప్రతి రోజూ కూడా తింటారు.మరీ ఆలస్యం ఎందుకు దానిమ్మ లో దాగిఉన్న పొషకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దానిమ్మలో విటమిన్ బి, సి, కె, ఇంకా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్లు వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. శరీర అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. దానిమ్మ గింజలు, అధిక రక్తపోటు, ఎక్కువ కొలెస్ట్రాల్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపులు వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

దానిమ్మ గింజలలోని పోషకాలు మూడ్ ను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ పోషకాలు రక్తప్రసరణను పెంచి అంగస్తంభన సమస్యలను నయంచేసి టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిని పెంచి లైంగిక కోర్కెలను పెంచుతాయి.మంచి కొలెస్ట్రాల్ పనితీరును పెంచి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.క్యాన్సర్ ను రాకుండా చేస్తుంది..దానిమ్మను మనం నిత్యం తీసుకుంటే కీళ్ల నొప్పులు, కడుపునొప్పి, కడుపుబ్బరం, మధుమేహం వంటి సమస్యలను తగ్గించడం తో పాటుగా ఇమ్మ్యునిటి ని పెంచుతుంది..చుసారుగా ఎన్ని లాభాలు ఉన్నాయో.. మీరు కూడా దానిమ్మ కాయలను తినడం మొదలుపెట్టండి..

Leave a Comment