ఈరోజుల్లో మనం ఎక్కువగా ఆరొగ్యాన్ని వాటిని కాకుండా రుచిగా వుండే వాటికి మొగ్గుచూపుతున్నాము. అలా చేస్తె మన ఆయుస్షు కాస్త సగానికి తగ్గి తొందరగా పైకి పోవడం ఖాయం. ఆ రోజుల్లో రాగులు ఎక్కువగా తినెవాల్లు.కాబట్టి ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇప్పుడు అదే ఫార్ములాను మళ్ళీ ఫాలో అవుతున్నారు. రాగి జావా ను ఎక్కువగా వాడుతున్నారు.. అసలు ఈ జావ కథ ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

రాగుల్లో ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి.
ఎదిగే పిల్లలకు రాగి జావ, మాల్ట్ తాగిస్తే వారి శరీర నిర్మాణం సరిగ్గా ఉంటుంది. అవయవాల్లో లోపాలు లేకుండా పిల్లలు ఎదుగుతారు. వారిలో స్థూలకాయం రాకుండా ఉంటుంది. రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలు తరచూ తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. ముఖ్యంగా స్ట్రెస్ ను తగ్గిస్తాయి. అందుకే మీరు కూడా ఇప్పటి నుంచి రాగి జావా లేదా రాగుల తో చేసిన దానిని తీసుకోవడం మంచిది