ఎర్రని అరటిని తింటే ఆ సమస్యలు పరార్..

manaarogyam

అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పొషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచెందుకు ఉపయోగ పడుతుంది. ఇందులో రకాలు ఉన్నాయి. ఎర్రటి అరటిని తింటే చాలా ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటో, ఎలా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎర్రటి అరటి పండ్లలో విటమిన్లు, కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు అనేక ఔషధ గుణాలూ వాటిలో ఉన్నాయి. ఎర్రటి అరటి పండులోని బీటా కెరోటిన్.. కంటి సమస్యలైన క్యాటరాక్ట్ ను నయం చేస్తుంది.వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

రేచీకటితో బాధపడే వారు రాత్రి భోజనం తర్వాత వరుసగా 40 రోజులు ఈ ఎర్రటి అరటి పండ్లను తింటే నయమవుతుంది.. చర్మ రుగ్మతలను నయం చేయడానికి ఇవి ఉపయోగ పడుతుంది.రోజూ రాత్రి భోజనం తర్వాత ఒక పండు చొప్పున తింటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. లివర్ సమస్యలు కూడా దూరం అవుతాయి.

Leave a Comment