చింత పులుసును ఇలా తీసుకుంటే ఎన్నో లాభాలు..

manaarogyam

మన దేశంలో చేసే చాలా వంటల లో చింత పండు ని వాడుతుంటారు..పులిహోర,పప్పు వంటి వంటల ఇది తప్పనిసరి.ఇందులో విటమిన్ సి, ఎ, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ చింతపండు నీరు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఈ నీళ్ల గురించి తెలుసుకుందాం..

చింతపండులో ఐరన్ లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడమే కాకుండా.. శరీరంలో రక్తహీనతను తగ్గిస్తుంది. చింతపండు బరువు తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఇందులో హైడ్రాక్సిల్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని అదనపు కొవ్వును బర్న్ చేయడం ద్వారా ఎంజైములను పెంచడంలో సహాయపడుతుంది..అధిక బరువును తగ్గిస్తుంది. దద్దుర్లు, మొటిమలు వంటి వాటి పై ఈ చింత పండు నీళ్లను పూయడం వల్ల అవి తొలగిపోతాయి.

గొంతు సమస్యలను తగ్గి స్తుంది.రక్తహీనత, పచ్చ కామెర్లు,ఉదర సమస్యల నుంచి కాపాడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలను చింత పండు నీళ్ళు నయం చేస్తాయి. మీరు కూడా ట్రై చేయండి

Leave a Comment