ఉసిరి తో ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే అస్సలు వదలరు..

manaarogyam

ఉసిరికాయలు అంటే చాలా మందికి ఇష్టం.. పుల్లగా, వగరుగా ఉండే ఈ కాయలల్లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు..ఈ ఉసిరి లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. చర్మ, జుట్టు సమస్యలను తగ్గించడంలో ఉసిరి బేష్..వాతావరణ మార్పుల వల్ల కలిగే హర్మోన్‌లోని వ్యత్యాసాన్ని నిరోధించడానికి, జలుబు లేదా దగ్గును నివారించడానికి ఉసిరికాయ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు..

ఉసిరి జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను సైతం నియంత్రించుకోవచ్చు. ఇది శరీర బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే, ఈ రసం రోజూ తాగడం వల్ల డయాబెటిస్ సమస్యను తొలగించుకోవచ్చు. అలాగే ఉసిరి రసం చర్మంపై నల్లటి మచ్చలను తొలగించడానికి సహాయపడతాయి.

ఫేషియల్ చేసుకుంటున్నప్పుడు ఉసిరికాయ పొడిని మిక్స్ చేసి ముఖానికి అద్దుకోవడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.. దానితో పాటుగా మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.ఇకపోతే మలబద్దకం, మధుమేహం వంటి వ్యాధులున్నవారికి ఎంతో మేలని, ఎన్నో రకాల వ్యాధులను తగ్గించేందుకు ఉసిరికాయ ఉపయోగపడుతుందని అంటున్నారు.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయి… ఇప్పుడు ప్రతి సీజన్ లో ఈ ఉసిరి విరివిగా దొరుకుంది వీటిని పైన తెలిపిన విధంగా తీసుకొని ఆరొగ్యాన్ని పెంచుకోండి..

Leave a Comment