చెమటలు పట్టడం కామన్.. కాకపోతే ఒక్కొక్కరిలొ ఒక్కో విధంగా చెమటలు పడతాయి. కొంతమందికి మాత్రం చెమటలు అధికంగా పడతాయి. ఎంతగా చెమటను కంట్రోల్ చేసే వాటిని వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు.ఒంట్లో వేడి ఎక్కువగా ఉండటం, ఒత్తిడి, ఓవర్‌గా ఉప్పు తీసుకోవడం, పలు రకాల మందుల వాడకం, ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, రక్త పోటు ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండటం, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల అధిక చెమటలు ఎక్కువగా పడతాయి.
చెమట నుంచి వెలువడే దుర్వాసన కారణంగా పక్కన వారికి అసౌకర్యం, మనకు చికాకు రెండూ పెరుగుతాయి. అందుకే అధిక చెమట నివారణకు పరిష్కార మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.ఇలాంటి సమస్యను యాపిల్ సైడర్ వెనిగర్ కంట్రోల్ చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఎలా వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్, ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన వాటర్‌లో దూది ముంచి చెమట ఎక్కడ ఎక్కువగా పడుతుందో అక్కడ రాసుకొవాలి.ఉదయం స్నానం చేయాలి.ఇలా కొద్ది రోజులు చేయడం వల్ల దుర్వాసన తగ్గడం తో పాటుగా చెమట నుంచి విముక్తి కలుగుతుంది.