ఇంగువ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే తప్పకుండా వాడుతారు..

manaarogyam

వంటలకు సువాసన అందించి, మంచి రుచి వచ్చేలా చేస్తుంది ఇంగువ.ఇది కేవలం రుచికి మాత్రమే కాదు,ఎన్నో రకాల అనారొగ్య సమస్యలను దూరం చేస్తుంది.కార్మినేటివ్‌, యాంటీస్పాస్మోడిక్‌ గుణాలుంటాయి. ఇవి పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి, నొప్పిని దూరం చేస్తాయి. జీర్ణశక్తి పెరిగేలా చేయడంలోనూ ఇంగువ ఉపయోగ పడుతుంది.ఆహారం త్వరగా జీర్ణమవ్వడానికి దోహదపడుతుంది..మూత్ర సమస్యలను తొలగించి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.

లంగ్స్‌, లివర్‌, కిడ్నీ, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ల వ్యాప్తిని తగ్గించడంలోనూ పనిచేస్తున్నట్టు వెల్లడయింది. క్యాన్సర్‌ వల్ల బరువు కోల్పోయిన వారు తిరిగి బరువు పెరగడానికి ఈ ఇంగువ మంచి మెడిసిన్.ఆడ వారిలో వచ్చే పీరియడ్స్ సమస్యలను వెంటనే తగ్గిస్తుంది.అధిక రక్తపోటు, డయాబెటి్‌సను నియంత్రించడంలోనూ సహాయపడుతున్నట్టు పరిశోధనల్లో గుర్తించారు.గొంతు సమస్యలు, ఉదర సమస్యలను ఇంగువ దూరం చేస్తుంది.కొద్దిగా ఇంగువను శోంఠి, తేనెతో కలిపి తీసుకున్నా చాతి నొప్పి మాయం అవుతుంది.కొద్దిగా ఇంగువ తో ఎన్నో లాభాలు ఉన్నాయి.. మీరు కూడా ఇంగువ ను వాడి ఫలితాలను ఆస్వాదించండి..

Leave a Comment