నేటి కాలంలో వాతావరణం కాలుష్యంతో పాటు తినే ఆహారం కూడా కల్తీ అవుతోంది. దీంతో అనేక వ్యాధులు వస్తున్నాయి. అయితే కొన్ని వ్యాధులు మెడిసిన్ వాడడం వల్ల తగ్గిపోతాయి. కానీ దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రం నిత్యం మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వ్యాధులు దరి చేరకుండా కొన్ని ఆయుర్వేదిక పద్ధతులు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని జబ్బులు వచ్చినా వాటిని నయం చేయడానికి కూడా ఆయుర్వేదం మంచి ఔషధంలా పనిచేస్తుందని వారు చెబుతున్నారు.

ఇప్పుడున్న చాలా మందిలో మూత్రపిండాల సమస్యలు ఉన్నాయి. ఇందులో కిడ్నీలో రాళ్లు రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కిడ్నీలో రాళ్లు కరిగిపోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు వాటిని తీసేయడానికి ఆపరేషన్ కు సైతం సిద్ధమవుతూ ఉంటారు. కానీ కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం వల్ల ఈ కిడ్నీల రాళ్లు పిండి లాగా కరిగిపోతాయని అంటున్నారు. ఈ ఆరోగ్య చిట్కాకు పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కా ఏంటో చూద్దాం.
ప్రకృతిలో దొరికే ఎన్నో మొక్కలు ఔషధాలుగా పనిచేస్తాయి. కానీ వాటిని మనం పట్టించుకోం. వీటిలో అంటు మామిడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అంటుమామిడి మొక్కల ఆకులు మూత్రపిండాల సమస్యను నయం చేస్తాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడినా.. ఇన్ఫెక్షన్ వచ్చినా.. వాటిని తగ్గించడానికి ఈ మొక్క ఆకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. అంటు మామిడి మొక్కలను కూరగా వండుకుంటారు. అయితే ఈ మొక్క ఆకు రసాన్ని తాగితే త్వరగా సమస్య నుంచి తేరుకోవచ్చ. ఈ ఆకు రసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం.
కొన్ని అంటుమామిడి మొక్కలను ఇంటికి తెచ్చుకోవాలి. ముందుగా ఈ ఆకులను తరగాలి. ఆ తరువాత ఒక గిన్నెలో పావు లీటర్ నీరు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక తరిగిన ఆకులను, పువ్వులను, కాడలను వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరువాత ఈ రసాన్ని వడకట్టి ఒక గ్లాసులో తీసుకోవాలి. ప్రతిరోజూ అరగ్లాసు చొప్పున ఈ నీటిని తాగడం వల్ల కిడ్నీలో రాళ్లున్నా.. మూత్రపిండాల్లో సమస్యలున్నా తొలిగిపోతాయి. ఇవే కాకుండా ఇతర ఎలాంటి ఇన్ఫెక్షన్లకైనా ఈ రసం పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.