Banana Milkshake : స‌మ్మ‌ర్ స్పెష‌ల్ డ్రింక్‌.. అర‌టి పండు మిల్క్ షేక్‌.. ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Banana Milkshake : మ‌నంద‌రం ఇష్టంగా తినే పండ్ల‌ల్లో అర‌టి పండు కూడా ఒక‌టి. ఈ పండు మ‌న‌కు అన్నికాలాల్లో ల‌భిస్తుంది. అలాగే అందరికి అందుబాటులో ఉంటుంది. అర‌టి పండు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అర‌టిపండును నేరుగా తిన‌డంంతో పాటు దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే మిల్క్ షేక్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌నానా మిల్క్ షేక్ చాలా రుచిగా ఉంటుంది. కేవ‌లం 5 నిమిషాల్లోనే ఈ మిల్క్ షేక్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా, చ‌ల్ల‌చ‌ల్ల‌గా బ‌నానా మిల్క్ షేక్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌నానా మిల్క్ షేక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అర‌టి పండు – 1, కాచి చ‌ల్లార్చిన‌ పాలు – అర గ్లాస్, పంచ‌దార – 2 స్పూన్స్, ఐస్ క్యూబ్స్ – త‌గిన‌న్ని, త‌రిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా.

బ‌నానా మిల్క్ షేక్ తయారీ విధానం..

ముందుగా అర‌టిపండును ముక్క‌లుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి. త‌రువాత ఇందులో పాలు, పంచ‌దార, ఐస్ క్యూబ్స్ వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. త‌రువాత దీనిపై డ్రై ఫ్రూట్స్ ను వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ‌నానా మిల్క్ షేక్ త‌యార‌వుతుంది. ఐస్ క్యూబ్స్ వేయ‌ని వారు దీనిని ఫ్రిజ్ లో ఉంచి చ‌ల్లగా అయిన త‌రువాత కూడా తాగ‌వ‌చ్చు. అలాగే ఇందులో పంచ‌దార‌కు బ‌దులుగా తేనె, డేట్ సిర‌ప్ కూడా వేసుకుని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ విధంగా బ‌నానా మిల్క్ షేక్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వేసవి కాలంలో ఈ విధంగా బ‌నానా మిల్క్ షేక్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు వేసవి తాపం నుండి కూడా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.