ఈ చెట్టు ఆకులతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

manaarogyam

ప్రకృతి లో దొరికే ఒక్కో చెట్టు ఒక్కో ఔషద గుణాన్ని కలిగి ఉంటుంది.అందులో మర్రి చెట్టు కూడా ఒకటి..ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే గుణాలు ఇందులో ఉన్నాయి.అందుకే ఆయుర్వేదం వైద్యంలో మర్రి చెట్టు ఆకులు, వేర్లు, బెరడు తదితర వాటిని విరి విరిగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా మర్రి చెట్టు ఆకులతో అనేక లాభాలను పొందొచ్చు. ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు, కేశ సంరక్షణకు సైతం ఉపయోగపడతాయి.

ఇక ఆలస్యం లేకుండా మర్రి చెట్టు ఆకులను ఎలా వాడితే మంచిదొ ఇప్పుడు తెలుసుకుందాం..

కొద్దిగా ఆవ నూనెలో మూడు లేదా నాలుగు స్పూన్ల మర్రి చెట్టు ఆకుల రసం వేసి వేడి చేయాలి. ఆపై ఈ నూనెను జుట్టుకు పట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి. గంట అనంతరం తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు సార్లు చేస్తె జుట్టు పెరుగుతుంది..

స్పూన్ ఎండ బెట్టుకున్న మర్రి చెట్టు ఆకుల పొడి, ఒక స్పూన్ ఎర్ర కంది పప్పు పొడి, రెండు స్పూన్ల పెరుగు మరియు కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకుని ముఖానికి పట్టించాలి.పది నిమిషాలు అయ్యాక చల్లని నీళ్లతో కడగాలి.. స్కిన్ టోన్ మారుతుంది.

అంతేకాదు జలుబు, దగ్గు ఆయాసం వంటి వాటిని తగ్గించడానికి మంచి మెడిసిన్..

Leave a Comment