మర్రి చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అనారొగ్య సమస్యలను నయం చెస్తుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఎటువంటి వ్యాధులను తగ్గిస్తుందో ఇప్పుడు చూద్దాం..
ఫైల్స్ సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. నొప్పికి తట్టుకోలేని పరిస్ధితుల్లో ఉన్నవారికి మర్రిపాలు చక్కగా ఉపయోగపడతాయి. మర్రిపాలు 5 చుక్కల్ని ఒక గ్లాసు పాలలో కలిపి తీసుకుంటే ఫైల్స్ సమస్య పరిష్కారమౌతుంది. అలాగే మర్రి ఊడలు సంతానలేమితో బాధపడుతున్న వారికి చక్కని ఔషదంగా పనిచేస్తుంది. మర్రి ఊడల చివరి లేత బాగాలను ఎండబెట్టి తరువాత దానిని మెత్తగా పొడిగా చేసుకోవాలి. దానిని పాలల్లో కలిపి రుతుస్రావం తరువాత 3 రోజుల పాటు తాగితే సంతానం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
కీళ్ళనొప్పులు, దంత సమస్యలకు మర్రి ఊడలతో తయారు చేసిన పొడి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా పదే పదే మూత్ర విసర్జనకు వెళ్ళటం చాలా మందిలో చూస్తుంటాం. వాటర్ తాగిన కొద్ది సేపటికే మూత్రం విసర్జన రావటం జరుగుతుంది. ఇలా జరగటాన్ని అతి మూత్ర సమస్యగా పిలుస్తుంటాం. ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. దీని వల్ల ముఖ్యం ప్రయాణాల సందర్భంలో పదేపదే మూత్ర విసర్జన చేయాల్సి రావటం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అతి మూత్ర సమస్యకు మర్రి బెరడు చక్కని పరిష్కారమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.జుట్టురాలడం తగ్గించి,ఒత్తైన జుట్టును అందిస్తుంది. అందాన్ని పెంచుకునేందుకు కూడా ఇది మంచి మెడిసిన్..