బిర్యాని ఆకును ఇప్పుడు విరివిగా వాడుతున్నారు.. వీటిని వేస్తే గానీ కూర, అన్నానికి మంచి రుచి రాదు. కేవలం రుచి మాత్రమే కాదు. వీటితో ఆరోగ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది.ఎన్నో రొగాలను కూడా నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం..

విటమిన్ బి, పాంటోధెనిక్ ఆమ్లం, ఫైరాడిక్సిన్, రైబో ఫ్లేవిన్ అధికంగా లభిస్తాయి. శరీరంలోని ఎంజైముల పనితీరుని ఇవి మెరుగుపరుస్తాయి. నాడీవ్యవస్థ పనితీరు, జీవక్రియలను మెరుగుపరచడంలో బిర్యానీ ఆకు సహాయపడుతుంది.అలాగే బిర్యానీ ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి సహకరిస్తుంది. అలాగే ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ తో ఇది సమర్థవంతంగా పోరాడుతుంది.

ఇందులో పొలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో, ప్రసవానంతరం గర్భస్థ శిశువుకు, గర్బిణీ స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. కాబట్టి గర్భిణీలు వంటకాల్లో బిర్యానీ ఆకు చేర్చుకోవడం మేలు..