కార్న్ ఫ్లోర్ తో అందమైన చర్మం మీ సొంతం..

manaarogyam

Updated on:

మొక్క జొన్న పిండి తో వంటలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. కానీ మొక్క జొన్న పిండి తో అందాన్ని పెంచుకొవచ్చు అని నిపుణులు అంటున్నారు. మరి ఎలా అందం పెంచుకొవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.మొటిమలు, నల్ల మచ్చలు, డార్క్ సర్కిల్స్‌, పొడి చర్మం ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతుంటాయి.

బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్‌, ఒక స్పూన్ టొమాటో పేస్ట్, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి.. ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వారినికి రెండు, మూడు సార్లు చేయడం వల్ల మొటిమలు, నల్ల మచ్చలు క్రమంగా తగ్గు ముఖం పడతాయి.

ఒక బౌల్‌లో టీ స్పూన్ కార్న్ ఫ్లోర్‌, అర టీ స్పూన్ పెరుగు, అర స్పూన్ కలబంద గుజ్జు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి.. పావు గంట లేదా ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముడతలు పోయి.. ముఖం మృదువుగా మారుతుంది. అంతేకాదు తెల్లని చర్మం మీ సొంతం.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చెయ్యండి.

Leave a Comment