ముఖ సౌందర్యం కోసం పెరుగు..

manaarogyam

పెరుగు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. శరీరానికి కావలసిన  కాల్షియం అందుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పెరుగుతో ఆరోగ్యం మాత్రమే కాదు అందం కూడా ఉందని చెబుథున్నారు..ప్రొటీన్స్ శరీరానికి కావాల్సిన పోషక విలువలను అందిస్తాయి. రోజుకో కప్పు పెరుగు తింటే.. బీపీ కంట్రోల్‌లో ఉండడం, ఎముకలు బలంగా మారడం, గుండె ఆరోగ్యం మెరుగుపడడం, శరీరంలో రోగనిరోధక శక్తి మరి పెరుగుతో అందాన్ని ఎలా మెరుగుపడుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం..

ఒక స్పూన్ పెరుగు, నిమ్మరసం, తేనె ను తీసుకొని బాగా మిక్స్ చేసి ముఖానికి ,మెడకు అప్లై చేయాలి.. ఒక 20నిమిషాలు వుంచి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తె మంచి ఫలితం ఉంటుంది.

మరో ప్యాక్..పెరుగు, పసుపు మరియు శెనగపిండి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా అప్లై చేసి.. అర గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల.. ముఖం అందంగా తయారవుతుంది..

పెరుగు మరియు ఎగ్‌వైట్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా అప్లై చేసి.. అర గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చెస్తె ముడుతలు తగ్గి మెరుస్తుంది. ఇలాంటి ప్యాక్ లు వారానికి రెండు సార్లు చెస్తె ముడుతలు తగ్గి ప్రకాసవంతంగా మారుతుంది.

Leave a Comment