ఆరొగ్యంగా ఉండాలంటే రోజూ ఉదయం లేదా సాయంత్రం జాగింగ్ చేయాల్సిందే.. అప్పుడే మనం మరింత ఆరోగ్యంగా ఉంటాము. అయితే రోజూ ఇలా చేస్తున్నప్పుడు మనిషి శక్తిని కోల్పోకుండా మంచి ఆహారాన్ని తీసుకొవాలని నిపుణులు అంటున్నారు..
జాగింగ్ చేసే వారు ఖచ్చితంగా తమ డైట్‌లో కొన్ని కొన్ని ఆహారాలను చేర్చుకోవాల్సి ఉంటుంది. మరి ఆ ఆహారాలు ఏంటో చూద్దాం..
రోజుకు ఒక అరటి పండును తప్పని సరిగా తినాలి. అప్పుడే నీరసం, అలసట వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.. అలాగే ప్రతి రోజు గుప్పెడు వాల్ నట్స్ ను నాన పెట్టుకుని తినాలి. శక్తిని ఇవ్వడంతో పాటుగా ఎన్నో వ్యాధులను నయం చేస్తుంది.
శక్తిని ఎక్కువగా ఖర్చు చేసే వాళ్లు చెర్రీస్ ను ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం..ఎక్కువ కాలరిలు ఖర్చు చెయ్యడం వల్ల వచ్చే నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.జాగింగ్ చేస్తే శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది.అందుకని సబ్జా నీళ్ళు అలాగే కొబ్బరి నీళ్ళు తాగడం మంచిది..