ఉదయం లేవగానే శరీరానికి వ్యాయామం తప్పనిసరి అని యోగా నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల మనుషులు రోజంతా చురుగ్గా ఉంటారు.వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనం కండరాలతోపాటు మెదడుకు ఎంతో మేలు కలిగిస్తుంది. వ్యాయామం చేసే సమయంలో మెదడుకు రక్తం , ఆక్సిజన్ సరఫరా ఎక్కువ జరుగుతుంది.దీని ద్వారా మెదడు కు రక్త ప్రసరణ జరుగుతుంది.
ఒక్కో వ్యాయామం ఒక్కొలా మనిషికి ప్రశాంతతను అందిస్తాయి..వాకింగ్,జాగింగ్ వంటి వాటిని చేయటం ద్వారా మెదడులో హిప్పోక్యాంపస్ అనే భాగం బాగా వృద్ధి చెందుతుంది. తద్వారా జ్ఞాపక శక్తి పెరిగేందుకు ఈ హిప్పోక్యాంపస్ దోహదపడుతుంది.. దీని తో వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
వ్యాయమం వల్ల గుండెతోపాటు , మెదడుకు రక్తాన్ని తీసుకువచ్చే పెద్ద రక్తనాళం, మెదడులోని సూక్ష్మ రక్తనాళాలు బలోపేతం అవుతాయి. రక్తం సరఫరాగా బాగా జరుగుతుంది.నిద్రలేమి దూరమై ప్రశాంతమైన నిద్రకు ఈ వ్యాయామాలు సహకరిస్తాయి.రోజుకు సగటున 45 నిమిషాల పాటు వ్యాయామం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు తేల్చి చెప్పారు..