జుట్టుకు ముల్తానీ మట్టి రాస్తే ఎమౌతుందో తెలుసా?

manaarogyam

ముల్తానీ మట్టి పేరు వినే ఉంటారు.. ఈ మట్టిని కేవలం ముఖానికి మాత్రమే వాడటం విని ఉంటారు. కానీ జుట్టుకు ముల్తానీ మట్టి రాయడం ఎప్పుడూ చూడలేదు. జుట్టు కు కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఒక బౌల్‌లో ముల్తానీ మట్టి, నిమ్మరసం మరియు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు, కేశాలకు బాగా పట్టించి అర గంట పాటు వదిలేయాలి. ఆ తర్వాత సాధారణ ష్యాంపూతో తల స్నానం చేయాలి. ఇలా వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేయడం వల్ల డ్రై హెయిర్ స్మూత్‌గా మారుతుంది. మరియు చుండ్రు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.అందుకోసం ముల్తానీ మట్టి, ఉసిరి పొడి, ఎగ్ వైట్‌, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాకు తలకు పట్టించి అర గంట నుంచి గంట పాటు ఆర నివ్వాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో తలస్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఇక చిట్లిపోయినా జుట్టును నివారించడంలోనూ ముల్తానీ మట్టి సహాయపడుతుంది. ముల్తానీ మట్టి, పాలు రెండిటిని మిక్స్ చేసుకుని తలకు, కేశాలకు అప్లై చేయాలి. గంట పాటు అలా వదిలేసి ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చెస్తె మంచి ఫలితం ఉంటుంది.

Leave a Comment