ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే అన్ని లాభాలు ఉన్నాయా?

manaarogyam

బ్లడ్ డొనేట్.. అంటే చాలా మంది భయం తో వణికి పోతున్నారు.. ఏదైనా అవుతుందేమో అని ఇవ్వడానికి ముందుకు రారు. బ్లడ్ డొనేట్ చేస్తే తమ శరీరంలో రక్తం తగ్గిపోతుందని భావిస్తుంటారు. కానీ, బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఎంతో మందికి సాయం చేసినట్టు అవుతుంది.ఒకసారి మనం ఇచ్చే రక్తం ముగ్గురికీ సరిపోతుంది. అంటే ముగ్గురి ప్రాణాలను కాపాడుకోవడానికి సహాయపడ్డారు. ఇలా చేయడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

మూడు నెలలకు ఒక సారైనా బ్లడ్ డొనేట్‌ చేస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ప్రతి మూడు నెలలకొకరి రక్తదానం చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి గుండె ఆరోగ్యంగా తయారు అవుతుంది. దాంతో గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బులు దరి చేరకుండా ఉంటాయి. అలాగే బరువు తగ్గడానికి కూడా బ్లడ్ డొనేషన్ ఉపయోగపడుతుంది. బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు శరీరంలో ఉన్న అదనపు కేలరీలు అన్నీ కరిగి పోతాయి. తద్వారా వెయిట్ లాస్ అయ్యి ఫిట్‌గా తయారు అవుతారు.

ఐరన్ కంటెంట్ తక్కువగా ఉంటేనే కాదు.. ఎక్కువగా ఉన్నా ఆరోగ్యానికి ప్రమాదమే. అయితే రక్త దానం చేయడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే ఐరన్ శాతం పూర్తి నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అంతే కాదు, మూడు నెలలకు ఒక సారి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల క్యాన్సర్ వ్యాధి వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది. లివర్ వ్యాధులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి. ఇంకా ఎన్నో ప్రయొజనాలను పొందొచ్చు.. గుర్తుంచుకోండి…

Leave a Comment