ప్రతి ఒక్కరు ఏదో ఒక పనితో బిజీగా మారుతున్నారు. ఈ తరుణంలో నిద్రకు కరువవుతున్నారు. రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉదయం తొందరగా లేవడం వల్ల శరీరానికి కావాల్సిన నిద్ర ఉండడం లేదు. దీంతో నిద్రలేమి సమస్యతో ఇతర అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది ఏదో ఒక కారణంతో సరైన నిద్ర పోవడం లేదు. నిద్రలేమి సమస్యల వల్ల తలనొప్పి, అలసట, కళ్ల నుంచి నీరు కారడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇవి ఎక్కువైతే కళ్లజోడు కూడా వస్తుంది. అయితే కళ్లజోడు అవసరం లేకుండా, కళ్ల సమస్యలు నయం చేయడానికి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మన కళ్లేదుటే ఉండే ఓ ఆకును రోజూ ఒకసారి నమిలి వేయడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు.
పూర్వకాలంలో ధనికుల ఇళ్లల్లో భోజనం చేసిన తరువాత కిల్లీని తినేవారు. ఇది ఆరోగ్యానికి మేలు చేయడానికేనని అప్పుడే గుర్తించారు. రాను రాను కిల్లీనీ తయారు చేసే ప్రత్యేక షాపులు ఏర్పడ్డాయి. కానీ అందులో ఇతర పదార్థాలు వేయడం వల్ల మరిన్ని సమస్యలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. అందువల్ల ఇతర పదార్థాలతో సంబంధం లేకుండా కొన్ని అవసరమైన మేరకు పదార్థాలను కలుపుకొని కిల్లీని తయారు చేసుకోవాలి. దానిని నమలడం వల్ల వచ్చే రసాన్ని మింగాలి. ఇది మింగడం వల్ల నిద్రలేమి ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలను పోగొట్టవచ్చు.

మరి ఎలాంటి కిల్లినీ తయారు చేసుకోవాలో ఇప్పడు చూద్దాం. మార్కెట్లో దొరికే కొన్ని తమలాపాకులు తెచ్చుకోవాలి. అందులోనుంచి ఒకటి తీసుకొని దానిపై పచ్చ కర్పూరం బిళ్లలను రెండు లేదా మూడింటిని పొడిగా చేసి వేయాలి. దానిపై కొంచెం తేనే వేసి రాయాలి. ఆ తరువాత చుట్టుకొని నోట్లో వేసుకొని నమలాలి. ఇలా నమలగా వచ్చిన రసాన్ని బయట ఉమ్మకుండా మింగేయాలి. ఈ రసం మింగడం వల్ల కళ్లు తిరగడం, అసిడిటీ, మలబద్ధకం, వికారంగా ఉండడం, చెమటలు పట్టడం వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.
తమలాపాకు, పచ్చ కర్పూరం తినడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. అంతేకాకుండా కళ్లు ఎర్రబడడం, కళ్ల మంటలు, కళ్ల దురదలు, కళ్ల నుంచి నీరు కారడం వంటి సమస్యలను ఇది దూరం చేస్తుంది. ఇక నిత్యం తలనొప్పితో బాధపడేవారు ఈ చిట్కాను పాటించడం వల్ల సమస్య నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవే కాకుండా జీర్ణక్రియ లాంటి సమస్యలకు తమలాపాకు చెక్ పెడుతుంది. అందువల్ల రోజుకు ఒకసారైనా ఈ చిట్కాను పాటించి నిద్రలేమి సమస్యల నుంచి దూరంగా ఉండాలని తెలుపుతున్నారు.