ఘాటైన నల్లని మిరియాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..

రుచిగా లేని ఆహారపదార్థాల లో ఎన్నో పొషక విలువలు దాగి ఉన్నాయి.. ఉదాహరణకు కాకరకాయలో ఎన్నో పొషకాలు ఉన్నాయి. తినడానికి చేదుగా ఉన్నా కూడా తింటున్నారు.. అలాగే మిరియాలు. కారంగా ఉన్నా కూడా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి..అందుకే వీటిని వివిధ రకాలుగా వంటల లో వాడుతుంటారు.. మరి ఈ మిరియాలతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

చలికాలంలో వచ్చే దగ్గు మరియు జలుబుని తగ్గించుకోవడానికి నల్లమిరియాలు మనకి బాగా సహాయం చేస్తాయి. ఒక కప్పు నీళ్లను మరిగించి అందులో నల్ల మిరియాల పొడిని, తేనె వేసుకుని తీసుకుంటే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది..

పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళు నల్ల మిరియాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొవ్వు కరుగుతుంది.పొట్ట తో పాటుగా అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు..

బ్లడ్ సర్క్యులేషన్ ను ఇంప్రూవ్ చేస్తాయి. అదేవిధంగా హైబీపీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యల నుండి మనల్ని నల్ల మిరియాలు కాపాడుతుంది.

క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది…

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.