బ్లాక్ హెడ్స్ కు టమోటాతో చెక్..

manaarogyam

బయట పెరుగుతున్న కాలుష్యాల వల్ల ముఖం పై దుమ్ము దూళి, జిడ్డు పేరుకు పోవడం కామన్. కెమికల్స్ ఎక్కువగా వున్న వాటిని వాడటం వల్ల చర్మం డ్యామేజ్ అవుతుంది.అందుకే రసాయనాలు ఎక్కువగా ఉన్న వాటిని కాకుండా ఇంట్లో దొరికే వాటితో కూడా చర్మ పై పేరుకున్న మురికిని, బ్లాక్ హెడ్స్ ను దూరం చేయవచ్చు. అని సౌందర్య నిపుణులు అంటున్నారు.. అందులో టమోటా తో ఈ సమస్యకు చెక్ పెట్ట వచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు టమోటా తో వీటిని మాయం చేద్దామా..

చాలా మందికి ముఖం మీద బ్లాక్ హెడ్స్ అసహ్యంగా ఉంటాయి. ఈ బ్లాక్ హెడ్స్ ను సులభంగా పోగొట్టుకోవడానికి టొమాటోలు ఎంతగానో సహకరిస్తాయి. దాని కోసం మీరు ఒక టొమాటోను తీసుకొని దానిని సగానికి కట్ చేయాలి. అప్పుడు టమోటాలలో కొంత భాగాన్ని చక్కెరలో ముంచాలి. తర్వాత ముఖంపై బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో కాసేపు మృదువుగా రుద్దండి. తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడుక్కోవాలి.. టమోటా లోని యాసిడ్స్, చక్కెర కలిసి మురికిని బ్లాక్ హెడ్స్ ను దూరం చేస్తాయి.ముఖానికి కాంతిని ఇస్తుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిది. మృదుత్వానికి టమోటా సహాయపడతాయి. మీకు ఈ టిప్ నచ్చితే ట్రై చెయ్యండి.

Leave a Comment