ఓట్స్ తో బ్లాక్‌హెడ్స్‌ మాయం.. ఎలాగంటే?

manaarogyam

మహిళలకు మొటిమలు రావడం సహజం.. తిండి విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవి వస్తాయి. వాటి తాలూకూ మచ్చల కారణంగా అందవీహినంగా మారుతున్నారు.ఇక బ్లాక్‌హెడ్స్‌ను తొలగించుకోవడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతుంటారు.. ఇవి ఎక్కువగా ముక్కుమీద ఉంటాయి. ఆ తర్వాత బుగ్గల మీద. చర్మం యొక్క రంద్రాలు తెరుచుకోవడం వల్ల బయట నుంచి వచ్చే దుమ్ము రేణువులు అందులోకి పోయి నల్లగా తయరవుతాయి. అలా ఇవి వస్తాయి.

వీటిని చాలా సులువుగా ఇంట్లో దొరికే వాటితోనే పొగొట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం…

కావలసిన పదార్థాలు:

అరటిపండు గుజ్జు:ఒకటి
ఓట్స్: రెండు స్పూన్
తేనే: ఒక స్పూన్

తయారి విధానం:

ముందుగా ఓట్స్‌ను మెత్తగా దంచి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.తరువాత అందులో తేనె, అరటిపండు గుజ్జు వేసి బాగా కలియబెట్టాలి..ఈ మిష్రమాన్ని ముఖానికి అప్లై చేసి నెమ్మదిగా రెండు వేళ్ళతో స్క్రబ్ చేసుకోవాలి. అలా ఐదు నిముషాలు అయ్యాక వేడి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తె మంచి ఫలితం ఉంటుంది.

ఓట్స్ మృత కణాలను తొలగించడానికి సహాయపడతాయి.అంతేకాకుండా చర్మంలో ఉన్న అదనపు నూనెను ఓట్స్‌ గ్రహిస్తాయి. తేనె మాయిశ్చరైజింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీమైక్రోబియల్‌ గుణాలు ఉంటాయి.. జిడ్డు చర్మం ఉన్న వారికి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది..

Leave a Comment