ఉడికించిన పల్లీలు తింటే ఎమౌతుందో తెలుసా?

manaarogyam

Updated on:

పల్లీలు అంటే చాలా మంది ఇష్ట పడుతున్నారు..అయితే ఉడికించిన పల్లీలు తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కాల్షియం, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ ఇ, నియాసిన్‌, ఫైబర్‌, ప్రోటీన్‌, అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్‌, మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్‌ వంటి పోషకాలెన్నో కూడా నిండి ఉంటాయి. అందుకే ఇవి ఆరోగ్య పరంగా బోలెడన్ని లాభాలను చేకూరుస్తాయి.

అయితే వేయించిన వేరుశెనగల కంటే ఉడికించిన వేరుశెనగలే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రోజూ గుప్పెడు ఉడికించిన వేరుశెనగలను తీసుకుంటే నీరసం, అలసట వంటి సమస్యలు దూరమై శరీరం చురుగ్గా, ఉత్సాహంగా తయారవుతుంది. వ్యాయామాలు చేసిన ఉడికించిన వేరుశెనగలు తీసుకుంటే ఫుల్ యాక్టివ్‌గా మారతారు. అలాగే గర్భిణి స్త్రీలు రోజూ ఉడికించిన వేరుశెనగలను తింటే ఫోలిక్‌ యాసిడ్ పుష్కలంగా లభించి కడుపులోని శిశువు ఎదుగుదల మెరుగ్గా మారుతుంది.

ఇకపోతే ఉడికించిన పల్లీలు తిన్నా అంతకు మించిన ఆరోగ్యం ఉంది.వేరుశెనగలను తింటే హెయిర్ ఫాల్ సమస్యకు అడ్డు కట్ట పడుతుంది. శరీర బరువు అదుపు తప్పకుండా ఉంటుంది. దంతాలు, ఎముకలు, కండరాలు దృఢంగా గట్టిగా మారతాయి. ఇక ఎదిగే పిల్లలకు కూడా ఉడికించిన వేరుశెనగలను పెడితే వారి ఆరోగ్యానికి చాలా మంచిద

Leave a Comment