పొద్దున్నే టీ కి బదులు ఈ జ్యూస్ తాగితే బోలెడు ప్రయోజనాలు..

manaarogyam

చాలా మందికి పొద్దున్నే లేవగానే టీ చుక్క నోట్లో పడకపోతే పొద్దుపొడవదు.కానీ అలా తాగటం వల్ల ఆరోగ్యానికి ముప్పు అని వైద్యులు ఇటీవల పరిశోధనలో తేల్చి చెప్పారు.అయితే టీ కి బదులుగా కూరగాయల తో చేసె జ్యుస్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయట. ఎలా తయారు చేసుకోవాలి, ఆ పానీయం వల్ల కలిగే ప్రయొజనాలు గురించి తెలుసుకుందాం..

కావలసినవి:
ఒక సొరకాయ ( ముక్కలుగా కోసుకోవాలి)
ఒక దోసకాయ
సెలెరీ
పుదీనా
నిమ్మరసం
జీలకర్ర పొడి
తగినంత ఉప్పు

తయారీ విధానం:
పైన తెలిపిన అన్నిటినీ మిక్సీ పట్టి వడ పోయాలి. అంతే జ్యూస్ రెడీ..
ఈ జ్యూస్ వల్ల కలిగే ప్రయొజనాలు..

విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి మేలు చేస్తుంది.

ఇది కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అంతేకాదు గుండెను ఆరోగ్యంగా ఉంటుంది.


రక్తాన్ని శుద్ధి చేసి అందులో వుండే మలినాలను బయటకు పంపిస్తుంది..

Leave a Comment