కూరల్లో వంకాయ రారాజు. వంకాయ కర్రీ రుచి మాటల్లో చెప్పలేనిది. ఆరోజు గుత్తి వంకాయ కూర ఇంట్లో ఉందంటే మటన్ కర్రీతో సమానమని కొందరు వెజ్ ప్రియులు భావిస్తారు. మార్కెట్లో విరివిగా లభించే వంకాలపై రకరకాల అపోహలు ఉన్నాయి. ఇవి తింటే వాతం.. అధిక బరువు సమస్యలుంటాయని అంటారు. కానీ వంకాయ ఎక్కువగా తిన్న వారిలో ఇలాంటి సమస్యలుండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విషయం పక్కనబెడితే వంకాయాలు మార్కెట్లో రెండు రకాలుగా లభిస్తాయి. ఒకటి గ్రీన్ కలర్లో.. మరొకటి వయొలెట్ కలర్లో.. ఈ రెండు రకాల్లో ఏ వంకాయలు మంచివి..? ఏవి తినాలి..? అనే సందేహం చాలా మందిలో ఉంది. అ సందేహం నివృత్తి చేసుకుందాం.
వంకాయలు తినడం ఎలాంటి అనారోగ్యానికి గురికాం. ఇవి తినడం ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే ఉన్నాయని అంటున్నారు. జొన్న, సజ్జరోట్టెల్లో వంకాయ కర్రీని స్టఫ్ గా వాడితే చాలా బాగుంటుంది. రుచికరంగా ఉండడంతో పాటు ఎనర్జీని పొందవచ్చు. అంతేకాకుండా వంకాయల్లో ఉండే గుణాలు క్యాన్సర్ కారకాలను చంపేస్తాయి. గుండె జబ్బలు రాకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా కార్డియాటిక్ అరెస్టు కాకుండా రక్షణగా ఉంటుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచడానికి వంకాయలు ఉపకరిస్తాయి. చర్మం కాంతివంతంగా ఉండడానికి కూడా ఇవి ఉపకరిస్తాయి.

వంకాయల్లో వాయిలెట్ కలర్లో ఉండేవి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. ఇవి సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహిస్తాయి. సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించే కూరగాయలు ఏవైనా అధిక పోషకాలు లభిస్తాయి. అందువల్ల గ్రీన్ కలర్లో ఉండే వంకాల కంటే వయోలెట్ కలర్లో ఉండేవి తినడం వల్ల అధిక లాభాలున్నాయని అంటున్నారు. వయొలెట్ కలర్లో ఉండే వంకాయలే ది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు.
వంకాయల్లో ఇతర కూరగాయలను కలిపి తింటూ కూడా రుచికరంగా ఉంటుంది. పలు రెస్టారెంట్లలో వంకాయతో చేసిన సూప్ ఇస్తారు. ఇది రుచిరకంగా ఉంటుంది. కానీ రెస్టారెంట్లలో దొరికే వాటికంటే ఇంట్లో కూర వండుకుని తినడం బెస్ట్ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల వంకాయలపై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా మార్కెట్లో తాజాగా ఉండేవి తీసుకొని తినాలని చెబుతున్నారు.