Teeth : మీ దంతాలు తళతళా మెరవాలంటే వారంలో రెండుసార్లు ఇలా చేయండి..

manaarogyam

నేటి కాలంలో ప్రతి ఒక్కరు రకరకాలు ఆహారం తింటున్నారు.కొందరు రుచిగా ఉండడానికి జింక్ ఫుడ్ ను కూడా ఆస్వాదిస్తారు. ఇదే సమయంలో దంతాలను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల వాటిపై గారె లాంటి పదార్థం చేరుతుంది. ఇది అలాగే పేరుకుపోయి తెల్లటి పళ్లు కలర్లోకి మారుతాయి. ఆ తరువాత ఎన్ని మెడిసిన్స్ వాడినా అది పోదు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల దీనిని పొగొట్టుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాకుండా మాములుగా ఉన్న దంతాలు ఈ చిట్కాలు పాటిస్తే తళతళలాడుతాయని అంటున్నారు. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం..

పచ్చగా మారిన దంతాలను ఈనో ద్వారా తెల్లగా మార్చుకోవచ్చు. ఇందులో బేకింగ్ సోడా ఉండడం వల్ల అది దంతాలు తెల్లగా మారడానికి ఉపకరిస్తుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ఈనో పౌడర్ ఒక గిన్నెలో వేయాలి. ఆ తరువాత అందులో నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేలితో గాని, బ్రష్ తో గానీ రెండు నిమిషాల పాటు బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల నోట్లో ఉన్న బాక్టీరియా అంతా పోతుంది. దీంతో దంతాలు తళతళా మెరుస్తాయి. పళ్లపై ఉన్న గారె తొలిగి తెల్లగా మారుతాయి.

దంతాలు తెల్లగా మారాలంటే మరో చిట్కాను కూడా ఉపయోగించవచ్చు. ఉప్పు, పసుపు, నిమ్మచెక్కను కలిపి దీనిని తయారు చేసుకోవాలి. ఒక నిమ్మచెక్కను తీసుకొని దానిపై ఉప్పు రాయాలి. ఆ తరువాత చిటికెడు పసుపు వేయాలి. అలాగే నిమ్మచెక్కతో దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై ఉన్న గారె తొలిగిపోతుంది. ఇలా చేయడం వల్ల నిమిషాల వ్యవధిలోనే గారె తొలిగిపోతుంది. ఇవే కాకుండా టూత్ పేస్ుటపై కొత్దిగా ఉప్పు కలిపి దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల కూడా దంతాలు తెల్లగా మారుతాయి.

నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందువల్ల నిమ్మకాయ చెక్కపై ఉప్పు చల్లి నేరుగా శుభ్రం చేసుకోవడం వల్ల బ్యాక్టిరియా తొందరగా తొలిగిపోతుంది. ఇలా చేయడం వల్ల దంతాలు తెల్లగా మారడంతో పాటు గట్టిగా ఉంటాయి. వీటితో పాటు పాటు ఆహారం తిన్న తరువాత నోటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఏదైనా తిన్న తరువాత నోట్లో నీరు పోసి తప్పనిసరిగా శుభ్రం చేయడం అలవాటు చేసుకోవాలి.

Leave a Comment