జీడిపప్పు పాలను తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

manaarogyam

చాలా మందికి రాత్రి పడుకొనే ముందు పాలు తాగడం అలవాటు. అలా అయితేనే వారికి నిద్ర పడుతుంది.ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మందికి నిద్రలెమి సమస్య కాస్త ఎక్కువగా ఉంటుంది.దాంతో భవిష్యత్తు లో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.ఇటువంటి పరిస్థితిలో మీరు కొన్ని చిట్కాలను ప్రయత్నించవచ్చు. మంచి నిద్ర కోసం జీడిపప్పు పాలను తాగవచ్చు. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.ఈ పాలను ఎలా తయారు చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం…

4 జీడిపప్పులు తీసుకుని కప్పు పాలలో నానబెట్టాలి. వాటిని 5 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు నానబెట్టిన జీడిపప్పును తీసుకుని దంచాలి. వాటిని పాల గిన్నెలో వేయాలి.. వాటిని మామూలు పాలను మరిగించినట్లు మరిగించాలి. రుచి కోసం కొద్దిగా చక్కెరను కూడా వేసుకోవాలి.అంతే జీడిపప్పు పాలు రెడీ.. దీన్ని వేడిగా లేదా చల్లగా తాగవచ్చు.ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది మీకు బాగా నిద్రపోవడానికి మరుసటి రోజు తాజాగా ఉండటానికి పనిచేస్తుంది.మెలటోనిన్, మెగ్నీషియం, జింక్ కలయిక నిద్రలేమి సమస్యను అధిగమించడానికి సహాయపడుతుంది.. పాలు కూడా నిద్రలెమి సమస్య ను దూరం చేస్తాయి.. మీకు ఇలాంటి సమస్య ఉంటే మీరు కూడా ట్రై చెయ్యండి..

Leave a Comment