కొత్తిమీర వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా?

manaarogyam

ఏదైనా వంట లో కొత్తిమీర వేస్తే రుచి వేరే లెవల్ అబ్బా..అందుకే ఎంతటి బిర్యానీ అయిన కూడా కొత్తిమీర పడాల్సిందే.. అయితే కొత్తిమీర వల్ల కలిగే ఆరోగ్య ప్రయొజనాలు మాత్రం చాలా మందికి తెలియదు.ఇక ఆలస్యం ఎందుకు ఈ కొత్తిమీర వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గాయాలు తగిలినచోట కొత్తమీర రాస్తే ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే దీనిలో లైనోలిక్ ఆసిడ్ లభిస్తుంది. ఈ ఆసిడ్ లో యాంటిహ్యమెటిక్, యాంటిఅర్థిటిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గాయాల మంటను చల్లారుస్తాయి.

ఈ కొత్తిమీర వల్ల శరీరానికి కావలసిన పొషకాలు అందుతాయని నిపుణులు అంటున్నారు.. కొత్తిమీర బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ లో పెడుతుందని చెబుతారు.కొత్తిమీరలఓలో డిటాక్సివ్, యాంటిసెప్టిక్, యాంటిఫంగల్, యాంటిఅక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ అందుకే చర్మ సమస్యలను నయం చేస్తుంది.

ఈ కొత్తిమీర లో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి రక్త హీనత సమస్యలు దూరం అవుతాయి.కొత్తిమీరలో లభించే నేచురల్ ఆయిల్స్, ముఖ్యంగా సిట్రోనెనాల్ నోటి అల్సర్స్ కి చెక్ పెడుతుంది.ఇందులో కాల్షియం ఎక్కువ.. ఎముకలు, దంతాల రక్షనకు దోహదపడుతుంది..ఇలా చెప్పుకుంటూ పోతే కళ్ళకు, పిరియడ్స్ సమస్యలను నయం చేస్తాయి..

Leave a Comment