ముఖం అందంగా వుండాలని చాలా మంది చాలా రకాలు ప్రయత్నాలు చేస్తారు.కానీ కొత్తిమీర తో ఎప్పుడైనా ట్రై చేసి ఉండరు. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా తయారవుతుంది. అయితే ఈ ప్యాక్ ను ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం..
కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్, ఫోలేట్, విటమిన్ సి, బీటా కెరోటిన్ లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మకణాల ఆక్సీకరణ ఒత్తిడిని నుంచి రక్షించి చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. చర్మకణాలలోని మృతకణాలను తొలగించి చర్మాన్ని తాజాగా వుంచుతాయి. చర్మంపై ముడతలను, వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనంగా కనిపించేందుకు సహాయపడతాయి. కొత్తిమీర రసం మొటిమలు, పిగ్మెంటేషన్, జిడ్డు, పొడి చర్మం, బ్లాక్‌హెడ్స్‌కు వంటి సమస్యలను తగ్గించడానికి సమర్ధవంతంగా సహాయపడుతుంది.
అందమైన ముఖ సౌందర్యం కోసం కొత్తిమీర పేస్ట్ ను ఏవిధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..కొత్తిమీర రసం,నిమ్మరసం , తేనె, పాలు ఇలా వీటన్నింటిని సమాన పాళ్లలో వేసి కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పదిహేను నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గి ముఖానికి మంచి నిగారింపు అందుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తె మంచి ఫలితం ఉంటుంది.