ఆలుమగలు అన్నాక అన్ని వుండాలంటారు పెద్దలు.. దంపతుల మధ్య బంధాన్ని పెంచడానికి ఎన్నో పద్ధతులు ఉన్నా, కొన్ని పద్ధతులు మాత్రం ఆ బంధాన్ని మరింత బలపరుస్తాయి. అందులో ఒకటి శృంగార సంభాషణలు.

చాలా మంది దంపతులు శృంగార సంభాషణలను కూడా బూతుగా పరిగణిస్తారు. అస్సలు మాట్లాడానికి కూడా ఇష్టపడరు. కానీ దంపతుల మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండాలే గాని, వారిని మించిన మంచి దంపతులు ఉండరు. మౌనంగా రతిక్రీడలో పాల్గొంటే వ్యభిచారంతో సమానం అనే నానుడి కూడా ఉన్న సంగతి తెలిసిందే.

ఆహ్లాదకరంతో కొంచెం అసభ్యంగా మాట్లాడిన దాని వల్ల వచ్చే ఎజాక్యులేషన్ అంతఇంత కాదు. కొందరు శృంగార సంభాషణకు భయపడతారు, కానీ ఇది పూర్తిగా నిరాధారమైనది. మీ భాగస్వామితో శృంగార సంభాషణలు మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మిమ్మల్ని దగ్గరకు తీసుకువచ్చేలా అగ్నిని పుట్టిస్తోంది.
చాలా మంచి అబ్బాయిలు, అమ్మాయిలను లైంగికంగా ఎంత రెచ్చగొట్టాలని చూసిన అయిష్టంగా, వారిని హాట్ చేయడం ఇష్టలేక ‘అవును, కాదు’ అనే సమాధానాలతో ఆపేస్తారు. కానీ శరీర ప్రేరణకు ఇద్దరి సహకారం అవసరమనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు.

మీ ఇద్దరి మధ్య కొన్ని శృంగార ప్రశ్నలు – సమాధానాల సంభాషణలు కలిగి ఉంటే, మీ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యాన్ని పెంచడమే కాక, మీ పడకగది మరింత శృంగారభరితంగా మారుతుంది.

మీ భాగస్వామికి మీ పట్ల ఉన్న భావాలను పూర్తిగా వినండి. బోల్డ్ గా మాట్లాడినంత మాత్రాన మీ మీద గౌరవం లేదని కాదు. నిజానికి ఇద్దరు చేతులు కట్టుకొని కూర్చుంటే ఇద్దరికి చికాకే పుడుతుంది. అందుకే ఈసారి మీరే చొరవ చేసుకొని కాస్త బోల్డ్ మాటలతో రెచ్చగొట్టండి. పని పూర్తి అయ్యాక మీ మీద గౌరవం అదే రెట్టింపు అవుతుంది.

మీ గూర్చి ఏం మాట్లాడానికి అయినా అవతలి వారికీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి. అంతేగాని, ఏదైనా శృంగారభరితమైన సంభాషణ మాట్లాడితే, నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు అనే మాట రానీయకండి. ఇది శృంగార మానసిక స్థితిని నాశనం చేస్తుంది. ఒక్కసారి మీ భాగస్వామి మీ పట్ల నిరాశ చెందితే అది మీ మధ్య దూరం మాత్రమే కాదు.. తిరిగి దగ్గర అయినా ఒకప్పటి సాన్నిహిత్యాన్ని ఇవ్వలేదు. అందుకే నాలుగు గోడల మధ్య అవతలి వారికీ ఇష్టమైనట్లు ఉండడానికి సిగ్గు, భయం తగినంత వరకే ఉండేలా చూసుకోండి.