రోజూ ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు..

manaarogyam

ఏదైనా వంటకు లేదా స్వీట్స్ కు నెయ్యి పడితే రుచి డబుల్ అవుతుంది.అందుకే పిల్లలు, పెద్దలు అందరూ కూడా నెయ్యి తో చేసిన వంటలను తినడానికి ఆసక్తి చూపిస్తారు.ఆవు నెయ్యి, గేదె నెయ్యి రెండు రకాలు ఉంటుంది. అందులో ఆవు నెయ్యి చాలా శ్రేష్ఠమైన ది. ఈ నెయ్యిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయట.. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..

అందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఇతర పోషకాలు మెదడు పని తీరును మెరుగు పరుస్తాయి. ఆలోచనా శక్తి కూడా పెరుగుతుంది. అలాగే రెగ్యులర్‌గా ఆవు నెయ్యిని తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.దాంతో గుండె జబ్బులు కూడా దరిచెరవు.

విటమిన్ ఎ పుష్కలంగా ఆవు నెయ్యి కంటి చూపు మెరుగు పరచడంతో పాటు కంటి సంబంధిత జబ్బులను నివారిస్తుంది.విటమిన్ కె ఉండటం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.మగవారు ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.ప్రతిరోజూ ఒక స్పూన్ తీసుకోవడం వల్ల సీజనల్ జబ్బులు రాకుండా ఉంటాయి.

Leave a Comment